శ్రీవారికి శాస్త్ర ప్రకారం సేవలు జరగడం లేదంటూ సుప్రీంలో పిటిషన్

శ్రీవారికి శాస్త్ర ప్రకారం సేవలు జరగడం లేదంటూ సుప్రీంలో పిటిషన్

ఢిల్లీ: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న వివిధ రకాల సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవారి భక్తుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో హిందూయేతరుల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలన్న నిబంధనలను పాటించడం లేదంటూ ఆరోపణలు చేశారు. పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. తొలుత తమ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వినాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వి రమణ, జస్టిస్ సూర్య కాంత్ మరియు జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనాన్ని కోరగా.. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ స్వీకరించిన సందర్భంగా జస్టిస్‌ రమణ స్పందిస్తూ... 'మీరు ఎక్కడి వారని అడిగి తెలుసుకున్నారు. తెలుగు వారమని తెలుపగా.. జస్టిస్ ఎన్వీ రమణ కూడా తెలుగులోనే మాట్లాడుతూ.. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఓపిగ్గా ఉండాలి. ప్రతి రోజూ పిటీషన్‌ను లిస్ట్‌ చేయమని రిజిస్ట్రీపై ఒత్తిడి తీసుకురాకూడదు. మేమందరం బాలాజీ భక్తులమే'' అని అన్నారు. పిటీషన్‌ను వచ్చే బుధవారం లిస్ట్‌ చేస్తూ.. ఆచారాలలో అక్రమాలను ఆరోపిస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల  ఫిర్యాదుపై స్పందించాలని సుప్రీం కోర్టు బుధవారం తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కోరింది.