పనిమనుషుల్లా హీరో ఇంట్లో కేటుగాళ్లు.. ఏకంగా రూ 2 కోట్లు కొట్టేశారు!

పనిమనుషుల్లా హీరో ఇంట్లో కేటుగాళ్లు.. ఏకంగా  రూ 2 కోట్లు కొట్టేశారు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇంట్లో దొంగలు తిష్ట వేశారు. పని మనుషుల రూపంలో కాన్నాళ్లుగా పాగా వేశారు. మాయ మాటలతో కోట్లు కొల్లగొట్టి కనిపించకుండా మాయమయ్యారు. భారీ మొత్తంతో ఆర్థిక మోసానికి పాల్పడిన ఈ కేటుగాళ్లు చివరకు కటకటాల పాలయ్యారు. సాప్ట్ గా కనింపే సూర్య అండ్ ఫ్యామిలీ తమ దగ్గరే పనిచేస్తున్న కేటుగాళ్లను గుర్తించలేకపోయారు.  దీంతో ఏకంగా రెండు కోట్లకు స్కాం చేసిన కంత్రీగాళ్లు పోలీసుల వలలో చిక్కారు.  

హీరో సూర్య ఇంట్లో జరిగిన ఈ ఆర్థిక మోసం ఇప్పుడు తమిళనాట పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో బాధితుడు మరెవరో కాదు, సూర్యకు వ్యక్తిగత భద్రతా అధికారిగా (PSO) పనిచేస్తున్న ఆంథోనీ జార్జ్ ప్రభు. నమ్మకంగా ఇంట్లో పనిచేసే పనిమనుషుల కుటుంబమే ఆయనకు ఏకంగా రూ.42 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టింది. సూర్య ఇంట్లో ఉండే పనివాళ్లు కదా.. అని నమ్మిన పాపానికి నట్టేట ముంచిపోయారు కంత్రీగాళ్లు

వల పన్ని...  బురిడీ కొట్టించారు

గత కొన్నాళ్లుగా సూర్య ఇంట్లో పనిమనిషిగా ఉన్న సులోచన,  ఆమె కొడుకు ఈ మోసానికి ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు పోలీసులు. వారు సూర్య పీఎస్వో ప్రభును తమ పెట్టుబడి పథకాలలో డబ్బు పెడితే, తక్కువ సమయంలోనే అధిక రాబడి ఇస్తామని నమ్మించారు. ఈ ప్లాన్ ఎంతో పకడ్బందీగా అమలు చేశారు. ఎంతలా అంటే..  ముందు ప్రభుకు నమ్మకం కలించేలా మొదటగా రూ..1 లక్ష బదిలీ చేస్తే, దానికి ప్రతిగా వారు వెంటనే 30 గ్రాముల బంగారం తిరిగి ఇచ్చారు.

దీంతో పూర్తిగా నమ్మిన ప్రభు, జనవరి , ఫిబ్రవరి నెలల మధ్య మొత్తం రూ.42 లక్షల వరకు ఆ పనిమనిషి కుటుంబానికి పెట్టుబడి రూపంలో బదిలీ చేశారు. అయితే, మార్చి నెలలో తన డబ్బును తిరిగి ఇవ్వమని  ప్రభు అడగటం మొదలుపెట్టగానే, ఆ కుటుంబం ఒక్కసారిగా అదృశ్యమైంది. తనను మోసం చేశారని గ్రహించిన ప్రభు, తప్పనిసరి పరిస్థితుల్లో జూలైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యా .. నమ్మకమే చివరకు మోసపోయామని గ్రహించాడు  ప్రభు.

రూ.2 కోట్ల మేర మోసం...

ప్రభు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసును లోతుగా విచారించారు.  ఇది కేవలం ఒక్క వ్యక్తికి సంబంధించిన మోసం కాదని తేలింది. సులోచన కుటుంబం చెన్నై వ్యాప్తంగా ఇలాంటి పథకాలతో అనేక మంది బాధితులను బురిడీ కొట్టించిందని నిర్థారణ అయింది. ఇలా సుమారు రూ.2 కోట్ల మేర అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.

ఈ పెద్ద మోసానికి సంబంధించి కేసులో  ఎట్టకేలకు సులోచన, బాలజీ, భాస్కర్, విజయలక్ష్మి లను పోలీసులు అరెస్టు చేశారు. ఆశ్చర్యకరంగా, వీరి నలుగురూ సూర్య ఇంట్లోనే వివిధ హోదాల్లో పనిమనుషులుగా పనిచేసినట్టు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం వారంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న హీరో సూర్య వారిని ఇంట్లో పని నుంచి తప్పించేశారు.