మలేసియాలో సూర్యాపేట యువకుడు మృతి

V6 Velugu Posted on Oct 19, 2021

సూర్యాపేట జిల్లా: సూర్యాపేటకు చెందిన యువకుడు మలేషియాలో మృతి చెందాడు.  పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణారెడ్డి, మాధవిల కుమారుడు రిశివర్ధన్ రెడ్డి(21) 
ఓ ప్రైవేటు షిప్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సోమవారం మృత్యువాతపడ్డాడు. 

షిప్‌పై నుంచి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి మృతి చెందినట్లు మలేషియా అధికారులు ఫోన్ లో సమాచారం అందించారు. వారం రోజుల క్రితమే తమ బిడ్డ ఫోన్ చేసి విధుల పట్ల ఒత్తిడి చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడని తల్లిదండ్రులు విలపించారు. త్వరలోనే వేరే కంపెనీకి మారతానని చెప్పిన కుమారుడు ఇంతలోనే చావు కబురు వచ్చిందని బోరున విలపించారు. రిశివర్ధన్ రెడ్డిది సాధారణ మరణం కాదని..  తమ కుమారుడి మృతిపై అనుమానాలు కలుగుతున్నాయని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.
 

Tagged Telangana, mother, father, suryapet, Malaysia, madhavi, , Rishivardhan Reddy.M(21), Private ship company, Venkata Ramana Reddy

Latest Videos

Subscribe Now

More News