శబరిమల యాత్రలో విషాదం... 8 మంది భక్తులు మృతి

శబరిమల యాత్రలో విషాదం... 8 మంది భక్తులు మృతి

శబరిమల యాత్రలో విషాదం నెలకొంది. శబరి నుంచి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల  వాహనం  శుక్రవారం అర్థరాత్రి లోయలో పడింది. దీంతో 8 మంది భక్తులు అక్కడిక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిలో ఓ తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు.

 తమిళనాడుకు చెందిన 10 మంది భక్తులు ప్రయాణిస్తున్న టెంపో షబరి నుంచి తిరిగి వస్తుండగా   తమిళనాడులోని తేని జిల్లాలోని కుమిలి-కంబం  హైవేపై  వెళ్తూ అదుపు తప్పి వాగులో పడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కుమిలిలోని ఆస్పత్రికి తరలించారు.  టెంపో 40 అడుగుల పై నుంచి పడటం వల్ల పూర్తిగా ధ్వంసం అయ్యిందని అధికారులు వెల్లడించారు.