పసుపు, పప్పు పంటల మధ్య గంజాయి సాగు.. నిందితుడి అరెస్టు..

 పసుపు, పప్పు పంటల మధ్య గంజాయి సాగు.. నిందితుడి అరెస్టు..

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కుడుగుంట గ్రామానికి చెందిన బోయిని రవి పసుపు, కంది పంటల మధ్య గంజాయి సాగు చేస్తున్నాడన్న సమాచారంతో శనివారం ఏఈఎస్, జిల్లా టాస్క్ ఫోర్స్, మోమిన్​పేట ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 2.572 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. గంజాయి సాగు చేస్తున్న రైతుకు రైతుబంధు నిలిపివేయాలని కలెక్టర్​కు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ భాస్కర్ గౌడ్ లేఖ రాశారు.