రేపు తెలంగాణ కేబినెట్‌ అత్యవసర సమావేశం

రేపు తెలంగాణ కేబినెట్‌ అత్యవసర సమావేశం

 తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రేపు(శనివారం) మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతోన్న లాక్‌డౌన్‌ రేపటితో ముగియనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం భేటీలో లాక్ డౌన్, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధింత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్ట్ చేసే అంశం.. హైడల్ పవర్ ఉత్పత్తి.. ఇతర అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.

ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో మంత్రులతో 4 గంటలపాటు సమావేశం అయ్యారు సీఎం కేసీఆర్. మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో పాటు.. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు.