కొండగట్టుకు ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మిస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొండగట్టుకు ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మిస్తాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

కొడిమ్యాల, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లేందుకు కొత్తగా ఘాట్ రోడ్డు నిర్మిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. కొండగట్టుకు వెళ్లే ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారిన తీరుపై ఈ నెల 11న ‘వీ6 వెలుగు’లో స్టోరీ పబ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం కొడిమ్యాలలో ఓ కార్యక్రమానికి హజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, కొండగట్టు మాస్టర్ ప్లాన్ లో భాగంగా అన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. 

ఒకవేళ మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలస్యమైతే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చించి మరో ఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం 46 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. దమ్మాయిపేటలో అంగన్వాడీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో చొప్పదండి మార్కెట్ చైర్మన్ కొత్తూరి మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లీడర్లు ప్రభాకర్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.