పని ఇచ్చిన వాడినే పొట్టన పెట్టుకున్నారు.. కుషాయిగూడ మర్డర్ కేసులో.. పోలీసుల అదుపులో నిందితులు..

పని ఇచ్చిన వాడినే పొట్టన పెట్టుకున్నారు.. కుషాయిగూడ మర్డర్ కేసులో..  పోలీసుల అదుపులో నిందితులు..

ఈ మధ్య పని ఇచ్చిన వాళ్లనే పొట్టన పెట్టుకుంటున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. మొన్న కూకట్ పల్లి రేణు అగర్వాల్ ను ఆమె ఇంట్లో పనిచేసే వ్యక్తులే హత్య చేయగా.. నిన్న (శుక్రవారం, సెప్టెంబర్ 12) తన కింద పనిచేసే వ్యక్తులే కుషాయిగూడ రియల్టర్ శ్రీకాంత్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

శుక్రవారం సాయంత్రం రియల్టర్ శ్రీకాంత్ రెడ్డిని అందరూ చూస్తుండగానే ధనరాజ్ , జోసెఫ్ అనే ఇద్దరు వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలోనే ధనరాజ్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ కేసులో మరో నిందితుడు జోసెఫ్ ను పరారీలో ఉండగా.. శనివారం (సెప్టెంబర్ 13) ఉదయం అదుపులోకి తీసుకున్నా పోలీసులు. 

డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడనీ..

మృతుడు శ్రీకాంత్ రెడ్డి  రియల్ ఎస్టేట్ వ్యాపారం, సెటిల్మెంట్లు చేస్తండేవాడని పోలీసులు తెలిపారు. అతని దగ్గర గత ఆరు సంవత్సరాలుగా ధనరాజ్ పనిచేస్తున్నాడు. తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుండడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. 

ప్లాన్ ప్రకారమే శ్రీకాంత్ రెడ్డి తో మాట్లాడేందుకు తన స్నేహితుడు జోసఫ్ ను తీసుకొచ్చాడు ధనరాజ్. డబ్బులు అడిగే విషయంలో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. మద్యం మత్తులో అత్యంత దారుణంగా శ్రీకాంత్ రెడ్డిని హత్య చేశారు నిందితులు. 

ధనరాజ్ , జోసెఫ్ లాలాగూడకు చెందినవారు .  మృతుడు శ్రీకాంత్ రెడ్డి పై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.