గ్రాండ్గా రాజ్యాంగ దినోత్సవం

గ్రాండ్గా రాజ్యాంగ దినోత్సవం

వెలుగు నెట్​వర్క్​:  రాజ్యాంగ దినోత్సవాన్ని నగరంలో పలుచోట్ల ఘనంగా జరుపుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు నేరేడ్​మెట్​లో పోలీసులతో ప్రతిజ్ఞ  చేయించారు. వికారాబాద్ లో మహాజన సోషలిస్ట్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.ఆనంద్​ ఆధ్వర్యంలో అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార కమిషన్  మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ పాల్గొన్నారు. 

బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్, అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ డాక్టర్ రియాజ్ హాజరయ్యారు. ట్యాంక్ బండ్ వద్ద కన్ఫాడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడు మాహేశ్వర్ రాజ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.