ఏప్రిల్ 15 నుంచిసీఎం రేవంత్ ​జపాన్​ టూర్

ఏప్రిల్ 15 నుంచిసీఎం రేవంత్ ​జపాన్​ టూర్
  • ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో పాల్గొననున్నరాష్ట్ర బృందం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెలలో వారం పాటు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్​పోలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కలిసి కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు. టూర్ షెడ్యూల్​ను ఇప్పటికే అధికారులు ఖరారు చేశారు. వచ్చేనెల 15 నుంచి 23వ తేదీ వరకు పర్యటన సాగనుంది. 

జపాన్​లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధితోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసు కురానున్నారు. కాగా.. డీలిమిటేషన్​పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తా మని సీఎం ఇప్పటికే ప్రకటించారు. దీంతో  వచ్చే నెల 15వ తేదీలోగానే హైదరాబాద్​లో దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ పార్టీలతో బహిరంగ సభను నిర్వహించున్నట్లు తెలుస్తోంది.