
కోనరావుపేట, వెలుగు: ఖతార్‌లో తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ధూంధాం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ హెడ్ శ్రీ వైభవ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐల ఆటపాటలు అలరించాయి. సింగర్ వరం పాడిన ఫోక్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సమితి ఖతర్ ప్రెసిడెంట్ గద్దె శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ మండల అశోక్, కార్యక్రమ కమిటీ సభ్యులు గడ్డం హారిక, ఉప్పుల సతీశ్, వెల్దండి వేణుప్రసాద్, తెలంగాణ కార్మికులు పాల్గొన్నారు.