డిసెంబర్ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ : సీఎం రేవంత్

డిసెంబర్  నెల 8, 9వ తేదీల్లో  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ : సీఎం రేవంత్
  • రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌ రూపొందిస్తున్నం: సీఎం రేవంత్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయ్యే సందర్భంగా డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 8న ప్రజా ప్రభుత్వ రెండో వార్షికోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఈ గ్లోబల్ సమిట్ లో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ – 2047 పాలసీ డాక్యుమెంట్‌ ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ ఆధారంగానే భవిష్యత్తులో నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. పాలసీ డాక్యుమెంట్​తో పెట్టుబడిదారులకు ఒక స్పష్టత వస్తుందన్నారు. గ్లోబల్ సమిట్​కు వివిధ దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.