ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగుతో అధిక లాభాలు : ఎమ్మెల్యే విజయ రమణారావు

ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగుతో అధిక లాభాలు :  ఎమ్మెల్యే విజయ రమణారావు
  •     ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్, వెలుగు: ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగుతో రైతులకు అధిక లాభాలు వస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ సింగిల్ విండో ఆధ్వర్యంలో శుక్రవారం సహకార వారోత్సవాల సందర్భంగా సహకార జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు. 

అనంతరం ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు త్వరలోనే సన్న వడ్లకు బోనస్ చెల్లిస్తుందన్నారు. గతంలో సన్న వడ్లకు ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలోనే రూ. 60 కోట్ల చెల్లించినట్లు గుర్తుచేశారు. 

తరచూ వరి సాగు వల్ల రసాయనిక ఎరువుల వాడకం పెరిగి భూసారం దెబ్బతింటున్నదని, పంటల మార్పిడి చేయాలన్నారు. ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగుతో అధిక లాభాలతోపాటు ప్రకృతి వైపరీత్యాలతో కూడా నష్టం ఉండదన్నారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని జవహర్​లాల్‌‌‌‌‌‌‌‌ నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించారు. లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, సీఈవో సంతోష్, డైరెక్టర్లు రాజమల్లు, రాములు, డీఏవో శ్రీనివాస్, పాల్గొన్నారు. 

జూబ్లీహిల్స్ విజయంపై సంబురాలు

పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ప్రజల విజయమని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు.