కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి బీఆర్ఎస్ నేతలు మోసం చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. ఈ ప్రాంతంనుంచి హరీష్ రావు మంత్రిగా పనిచేసినా లాభం లేకుండా పోయిందన్నారు. మెదక్ జిల్లాలోమెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెదక్ లో మినీ ట్యాంక్ బండ్ హామీ గాలికి పోయిందన్నారు. అన్నదాలకు సాగునీరందక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
రూరల్ ఏరియాల్లో పాడి రైతులకు న్యాయం జరగడం లేదు.. మాజీ మంత్రి హరీష్ రావు బినామీలే ఈ పాల వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు కవిత. మెదక్ ప్రాంతంలో కొన్ని శాఖల్లో ఉద్యోగులు, సిబ్బంది కొరత ఉంది భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే సామాజిక తెలంగాణ రావాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఏ చిన్న పదవులు కూడా అనుభవించని చిన్న కులాలున్నాయన్నారు. సిన్సియర్ గా చేసిన ఉద్యమాలన్నీ విజయం సాధించాయన్నారు.
