ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంబురంగా జెండా పండుగ..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంబురంగా  జెండా పండుగ..
  • వాడవాడల రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
  • అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు
  • ఆకట్టుకున్న శకటాలు
  • జాతీయ జెండాలను ఎగురవేసిన కలెక్టర్లు.

మహబూబ్​నగర్​, గద్వాల, వనపర్తి, నాగర్​కర్నూల్, వెలుగు : ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలను ప్రజలకు సంబురంగా జరుపుకొన్నారు. ఆదివారం రాత్రి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్​ఆఫీసులు, విద్యాసంస్థలను మూడు రంగులతో అలకరించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆయా పట్టణాలు, గ్రామాల్లో పాఠశాలల విద్యార్థులు ప్రభాత భేరీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా విద్యార్థులు దేశ స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణ ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధులను కొనియాడుతూ వారికి జేజేలు పలికారు. మహబూబ్​నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్​కర్నూల్ జిల్లాల్లోని నిర్వహించిన రిపబ్లిక్​డే వేడుకల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు విజయేందిర బోయి,  సిక్తా పట్నాయక్, సంతోష్, ఆదర్శ్​ సురభి, బాదావత్ సంతోష్  పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. 

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఎక్కి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన శకటాల ప్రదర్శన, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు వీక్షించారు. అనంతరం ఉత్తమ శకటాలకు బహుమతులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. 

సామాజిక న్యాయం..సర్కారు లక్ష్యం

సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నేటి ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామ సభలు నిర్వహించి, సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించాం. రైతు భరోసా పథకం క్రింద జిల్లాలో 3 లక్షల 7 వందల మంది రైతులకు ఎకరాకు 6 వేల చొప్పున రూ.415 కోట్ల వారిఖాతాల్లో జమ చేశాం. – కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్​కర్నూల్​