- ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి, వెలుగు: గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండలంలోని రేగులపల్లి గ్రామంలో స్కూల్ ప్రహరీ, సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దడమే తమ సంకల్పమన్నారు. అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
పనులు నాణ్యతతో నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణ, బ్లాక్ అధ్యక్షుడు దామోదర్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్, ఆలయ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ లక్ష్మీ తిరుపతి, నరసయ్య, లింగం పాల్గొన్నారు.
