దళితబంధుపై హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా

దళితబంధుపై హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసే వరకు దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ  హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఈ అంశంపైనే పిటిషన్ దాఖలు చేయడంతో రెండింటినీ కలిపి విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. మరోవైపు వాచ్ సంస్థ తరపున న్యాయవాది శశికిరణ్ ప్రధాన న్యాయమూర్తి ముందు దళితబంధు పంపిణీని నిలిపివేయాలంటూ గతంలో దాఖలు చేసిన పిటిషన్ ను ప్రస్తావించారు.  వాచ్- వాయిస్ ఆఫ్ ది పీపుల్ అనే సంస్థ హుజరాబాద్ లో దళితబంధు డబ్బు పంపిణీని నిలిపివేయాలంటూ ఈనెల నాలుగున పిటిషన్ వేశారు.