24 ఏళ్లుగా సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌జెర్నీ తర్వాత..బజాజ్ కు అలియాంజ్ గుడ్ బై

24 ఏళ్లుగా సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌జెర్నీ తర్వాత..బజాజ్ కు  అలియాంజ్ గుడ్ బై
  • ముగిసిన రూ.21వేల390 కోట్ల డీల్‌‌‌‌.. 
  • బజాజ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో 97 శాతానికి చేరిన బజాజ్ గ్రూప్ వాటా 

న్యూఢిల్లీ:గత 24 ఏళ్లుగా సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా నడిచిన బజాజ్‌–అలియాంజ్‌ జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌కు ముగింపు వచ్చింది. బజాజ్‌‌‌‌ అలియాంజ్ జనరల్‌‌‌‌ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో 23 శాతం చొప్పున వాటాను  అలియాంజ్‌‌‌‌ ఎస్‌‌‌‌ఈ నుంచి  రూ.21,390 కోట్లకు బజాజ్ గ్రూప్ దక్కించుకుంది.  దీంతో ఈ ఇన్సూరెన్స్ కంపెనీల్లో బజాజ్ వాటా 97శాతానికి చేరింది. 

బజాజ్‌‌‌‌ ఫిన్సర్వ్‌‌‌‌, బజాజ్‌‌‌‌ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌, జమ్నాలాల్‌‌‌‌ సన్స్  కలిసి ఈ డీల్‌‌‌‌ను పూర్తి చేశాయి. బజాజ్‌‌‌‌ అలియాంజ్‌‌‌‌  జనరల్ ఇన్సూరెన్స్‌‌‌‌లో 23 శాతం వాటాను రూ.12,190 కోట్లకు, బజాజ్‌‌‌‌ అలియాంజ్‌‌‌‌ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌లో 23 శాతం వాటాను  రూ.9,200 కోట్లకు బజాజ్ గ్రూప్ కొనుగోలు చేసింది. 

దీంతో ఈ కంపెనీల్లో ఈ గ్రూప్ వాటా 74 శాతం నుంచి 97 శాతానికి పెరిగింది. అలియాంజ్‌‌‌‌ దగ్గర ఉన్న  మిగిలిన మూడు శాతం వాటాను  షేర్ బైబ్యాక్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కొనుగోలు చేస్తాయి.