భారీగా తగ్గిన వెండి ధరలు..ఒక్కరోజే రూ.12వేల500 తగ్గింది

భారీగా తగ్గిన వెండి ధరలు..ఒక్కరోజే రూ.12వేల500 తగ్గింది

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.12, 500 తగ్గి రూ.2,43,500 స్థాయికి చేరింది. క్రితం సెషన్‌‌‌‌లో ఇది రూ.2.56 లక్షల రికార్డు గరిష్టాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాల స్వీకరణ దీనికి ప్రధాన కారణం. పసిడి ధర కూడా 10 గ్రాములకు రూ.900 మేర తగ్గి రూ.1,40,500కు పడిపోయింది.

 అమెరికా డాలర్ స్థిరంగా ఉండటం, సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ తగ్గడం వల్ల ఈ క్షీణత కనిపించిందని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ సెక్యూరిటీస్ నిపుణులు చెప్పారు. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర 0.67 శాతం తగ్గి 4,426.91 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. టారిఫ్​లపై అమెరికా సుప్రీంకోర్టు వెల్లడించబోయే  తీర్పులు, ఉపాధి లెక్కల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.  

శుక్రవారం రాబోయే నాన్-ఫామ్ పేరోల్ రిపోర్ట్​ కోసం ఎదురుచూస్తున్నారు. బులియన్ ధరలపై ఒత్తిడి మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.