భారీగా తగ్గిన రెమిడెసివిర్ వ్యాక్సిన్ ధర

భారీగా తగ్గిన రెమిడెసివిర్ వ్యాక్సిన్ ధర

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతండటంతో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరిగింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా వ్యాక్సిన్లలో ఒక్కోదానికి ఒక్కోరేటు ఉంది. వాటిలో రెమిడెసివర్ వ్యాక్సిన్‌ను దేశంలో ఏడు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ వ్యాక్సిన్ ధరను కేంద్రం చొరవతో ఉత్పత్తి కంపెనీలు భారీగా తగ్గించాయి. పాత ధరలతో పోల్చితే దాదాపు రూ. 2 వేల వరకు తగ్గించాయి. ఈ వ్యాక్సిన్ కొత్త ధరలను నిర్ణయించిన కేంద్ర కెమికల్స్ అండ్ ఫర్టీలైజర్స్ మంత్రిత్వ శాఖ.. ఓ ప్రకటన విడుదలచేసింది.

రెమిడెసివర్ వ్యాక్సిన్ కొత్త ధరలు 

కాడిలా వ్యాక్సిన్ ధర గతంలో రూ. 2,800గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 899కి తగ్గించారు.

సింజెన్ వ్యాక్సిన్ ధర గతంలో రూ. 3,950గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 2,450కి తగ్గించారు.

డాక్టర్ రెడ్డీస్ వ్యాక్సిన్ ధర గతంలో రూ. 5,400గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 2,700కి తగ్గించారు.

సిప్లా వ్యాక్సిన్ ధర గతంలో రూ. 4,000గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 3,000కి తగ్గించారు.

మైలాన్ వ్యాక్సిన్ ధర గతంలో రూ. 4,800గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 3,400కి తగ్గించారు.

జుబ్లియంట్ వ్యాక్సిన్ ధర గతంలో రూ. 4,700గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 3,400కి తగ్గించారు.

హెటిరో వ్యాక్సిన్ ధర గతంలో రూ. 5400గా ఉంటే.. ఇప్పుడు ఆ ధరను రూ. 3,490కి తగ్గించారు.