OTT Thriller: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్.. గ్రిప్పింగ్ నరేషన్.. బస్సులో మర్డర్.. 10 గంటల్లో దర్యాప్తు..

OTT Thriller: ఓటీటీలో దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్.. గ్రిప్పింగ్ నరేషన్.. బస్సులో మర్డర్.. 10 గంటల్లో దర్యాప్తు..

ఓటీటీలో క్రైమ్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ జోనర్లో సినిమాలు, సిరీస్ లు వస్తున్నాయంటే.. ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తుంటారు. ఇక వచ్చాక చెప్పేదేముంది.. అది అయిపోయేవరకు టివీళ్లకు, ఫోన్లకు అతుక్కుపోయి చూస్తుంటారు.

అంతలా ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు ప్రభావం కలిగించాయి. ఇపుడాలాంటి ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. మరి ఆ సినిమా ఏంటీ? అదెక్కడ స్ట్రీమ్ అవుతోంది? ఆ సినిమా కథేంటీ? అనే విషయాలు తెలుసుకుందాం. 

ఇళయరాజా కలియపెరుమాళ్ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ టెన్ హవర్స్. సిబి సత్యరాజ్ హీరోగా నటించిన ఈ సినిమా 2025 ఏప్రిల్ 18న థియేటర్స్లో గ్రాండ్గా విడుదలైంది. అయితే, థియేటర్స్ లో మిక్సెడ్ టాక్ రావడంతో.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో వసూళ్లు కూడా పెద్దగా సాధించలేకపోయింది.

ఇపుడీ టెన్ హవర్స్ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజై మంచి వ్యూస్ రాబడుతోంది. క్రమమంగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో  ఓటీటీలో దుమ్మురేపుతుంది. ప్రస్తుతం నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో (మే 13)కి రెండో స్థానాన్నీ కైవసం చేసుకుంది. ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పాలంటే.. కొన్ని పెద్ద సినిమాలను బీట్ చేసి మరి ట్రెండింగ్‍లో దూసుకెళ్తోంది. 

ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. SUN NXT,టెంట్‍కొట్టా ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. అంటే, ఈ మర్డర్ మాస్టరీ థ్రిల్లర్ మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్లో ఉందన్నమాట. 

కథేంటంటే:

ఆతూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కాస్ట్రో ( సిబి సత్యరాజ్ ). ఇతనొక ముక్కుసూటి పోలీసు అధికారి. అతనికి రాత్రిపూట ఒక అమ్మాయి తప్పిపోయిందని ఫిర్యాదు అందుతుంది. దర్యాప్తులో, ఆ అమ్మాయి కిడ్నాప్ చేయబడిందని, అది ముందస్తు ప్రణాళికతో జరిగిందని కాస్ట్రో తెలుసుకుంటాడు. ఈ క్రమంలోనే చెన్నై-కోయంబత్తూరు బస్సులో రాత్రి మర్డర్ జరుగుతుంది. ఆ రాత్రే ఈ మర్డర్ కేసును కాస్ట్రో దర్యాప్తు చేయాల్సి వస్తుంది. 10 గంటలే మిగిలి ఉంటుంది.

ఇలా రెండు ఇన్సిడెంట్స్ వల్ల ఇన్స్పెక్టర్ కాస్ట్రో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఆ రాత్రి అదే స్టేషనుకి.. మిస్సింగ్ అండ్ మర్డర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వస్తుంది?  మిస్సైన అమ్మాయి ఎవరు? బస్సులో మర్డర్ అయిన వ్యక్తి ఎవరు? పదిగంటల వ్యవధిలోనే ఇన్స్పెక్టర్ కాస్ట్రో ఎలా ఈ కేసుని చేధించాడు? అనేది మిగతా స్టోరీ. 

డైరెక్టర్ ఇళయరాజా కలియపెరుమాళ్ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు. అందుకోసం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ట్విస్టులు ఉండేలా కథాంశం రాసుకున్నాడు. ప్రేక్షకుడు ఏ మాత్రం ఊహించలేకుండా నెక్స్ట్ ఏమవుతుందనే సస్పెన్స్ క్రియేట్ చేశాడు. రెండు కీలక సంఘటనలు.. పది గంటలా సమయం.. అతని దర్యాప్తులో ఊహించని మలుపులు.. ఇలా ప్రతిదీ ఆసక్తి కలిగేలా తెరకెక్కించాడు. 

ఇకపోతే ఈ 'టెన్ అవర్స్' మూవీలో ఇన్‌స్పెక్టర్ కాస్ట్రోగా శిబి సత్యరాజ్ నటించాడు. ఆడుకలం మురుగదాస్, గజరాజ్, దిలీపన్, జీవా రవి, శరవణ్ సుబ్బయ్య, రాజ్ అయ్యప్ప సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జై కార్తీక్ సినిమాటోగ్రఫీ అందించగా.. కె.ఎస్. సుందరమూర్తి సంగీతం సమకూర్చాడు. లారెన్స్ కిషోర్ ఎడిటింగ్.