ఉప్పల్, వెలుగు: ఉప్పల్ శిల్పారామంలో కేంద్ర హస్తకళల అభివృద్ధి కమిషనర్ కార్యాలయం, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో థీమెటిక్స్ ఎగ్జిబిషన్ బుధవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ డైరెక్టర్ డాక్టర్ సునీల్‌కుమార్ బాబు, హ్యాండీక్రాఫ్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చలా, సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్‌సాగర్ రెడ్డి హాజరయ్యారు. క్రాస్ స్టిచ్, బంజారా ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, చెక్క బొమ్మలు, కలంకారి, జరీ-జర్దోసీ, కొబ్బరి గుళికల వస్తువులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
