రామాయంపేటలో దొంగల హల్‌చల్.. ఇళ్లు, గుళ్లలో చోరీ

 రామాయంపేటలో దొంగల హల్‌చల్.. ఇళ్లు, గుళ్లలో చోరీ
  • ఓ ఇళ్లు, రెండు ఆలయాల్లో చోరీ 

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శుక్రవారం రాత్రి దొంగలు  హల్చల్ చేశారు. ఓ ఇంటితో పాటు రెండు గుడుల్లో చొరబడి సుమారు ఆరు లక్షల సొత్తును ఎత్తు కెళ్లారు. బాధితుల వివరాల ప్రకారం... రామాయంపేట మండలం ఝాన్సి లింగాపూర్ కు చెందిన స్వామి  ట్రాన్స్కో డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. ఆయన గత కొంత కాలంగా పట్టణంలోని రైతు బజారు దగ్గర ఓ ఇంటిలో అద్దెకు నివసిస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఫ్యామిలీతో స్వగ్రామానికి వెళ్లాడు.  శనివారం ఉదయం ఇంటి ఓనర్ లేచి చూసేసరికి స్వామి  కిరాయికి ఉండే ఇంటి తాళం పగులగొట్టి ఉంది. దీంతో  స్వామికి సమాచారం ఇవ్వగా అతను వచ్చి ఇంట్లో పరిశీలించారు. దొంగలు బీరువా తాళం తీసి అందులో ఉన్న 4 లక్షల రూపాయల నగదుతోపాటు, తులంన్నర బంగారు  నగలు, 12 తులాల వెండి ఎత్తు కెళ్లినట్లు గుర్తించారు. అలాగే పట్టణ శివారులోని పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో కూడా దొంగలు చొరబడి అమ్మవారి పుస్తె, మెట్టెలతో పాటు కొంత నగదును ఎత్తు కెళ్లారు. ఈ మేరకు బాధితులు, ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.