రథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల

రథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల

తిరుమల:రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబైంది. మంగళవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహన సేవలపై సప్తగిరీశుడు దర్శనమివ్వనున్నారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలువబడే ఈ ఉత్సవాన్ని కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఏకాంతంగా నిర్వహించనున్నారు. వాహన సేవలను ఆలయంలోని కల్యాణ మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది.

మంగళవారం సుర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సప్త వాహన సేవలపై శ్రీవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణమూర్తిగా దర్శనమివ్వనున్నారు. అనంతరం 9 గంటలకు చిన్నశేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంతవాహనం, రెండు గంటలకు చక్రస్నానం, 4 గంటలకు కల్పవృక్ష వాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవను నిర్వహిస్తారు. వాహన సేవలు జరిగే ఆలయంలోని కల్యాణ అందంగా తీర్చిదిద్దారు.