లవ్యూ బాస్ : ఎగబడి పని చేయొద్దు.. తక్కువ చెయ్యి : ఉద్యోగులకు బాస్ వార్నింగ్

లవ్యూ బాస్ : ఎగబడి పని చేయొద్దు.. తక్కువ చెయ్యి : ఉద్యోగులకు బాస్ వార్నింగ్

టార్గెట్ ఇచ్చి కంప్లీట్ చేయకపోతే బాస్ నుంచి అక్షింతలు.. ఇచ్చిన పని సరిగా చేయకపోతు బాస్ నుంచి తిట్లు.. ఏం పీకుతున్నార్రా అంటూ చివాట్లు.. ఆఫీసుకు ఎందుకు వస్తున్నారు అంటూ చిర్రుబుర్రులు.. ఇవన్నీ అన్ని కంపెనీల్లో కామన్. ఈ స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్.. ఈ కంపెనీ సీఈవో మాత్రం వెరీ స్పెషల్.. ఎందుకయ్యా ఎగబడి పని చేస్తున్నారు.. చిన్నగా చేయండి.. టార్గెట్ ఎందుకు అంత త్వరగా కంప్లీట్ చేస్తున్నారు.. నిదానంగా చేయండి.. సెలవులు కావాలంటే తీసుకోండి అంటూ టార్గెట్లు టకటకా పూర్తి చేస్తున్న ఉద్యోగులపై చిర్రుబుర్రులాడుతున్నారు ఈ సీఈవో..

ప్రతి దానికీ ఎందుకు రెస్పాన్స్ అవుతున్నారు.. ప్రతి విషయాన్ని నాకు ఎందుకు చెబుతున్నారు.. మీకు ఇచ్చిన పనిని మీరు చేసుకోండి.. ముఖ్యమైన విషయలు మాత్రమే నాకు చెప్పండి.. ప్రతిదానికీ టెక్ట్స్ మెసేజ్ చేయటం.. ఈ‌‌–మెయిల్స్ చేయటం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదంటూ ఈ కంపెనీ సీఈవో ఉద్యోగులపై మండిపడుతున్నాడు. చిత్రంగా విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం.. నిదానంగా పని చేయండి.. ప్రశాంతంగా ఉండండి అంటూ ఉద్యోగులకు విలువైన సలహాలు ఇస్తున్నారు ఈ సీఈవో.. ఇంతకీ ఇలాంటి కంపెనీ ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం..

Also Read :- దేశంలో తగ్గుతున్న పేదరికం

ఇటీవల రెడ్డిట్ యూజర్ షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పని చేయడంలో తక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శించమని తన బాస్ చెప్పారని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాంతో పాటు తన బాస్ తో జరిగే చర్చల పరంపరనూ తెలియజేశాడు. పనిలో వేగాన్ని తగ్గించమని, ఈ మెయిల్స్ కు రిప్లై ఇవ్వడం అపివేయాలని తన బాస్ చెప్పినట్టు అతను వెల్లడించాడు. పని వాతావరణం గురించి తన బాస్ ఆందోళన వ్యక్తం చేశారని, తక్కువ పని చేయమని సూచించినట్టు యూజర్ పోస్టులో తెలియజేశాడు. కానీ అతను ఎక్కడ పని చేస్తున్నాడు, ఆ కంపెనీ ఎక్కడుందని అన్న విషయాలు మాత్రం పోస్టులో వెల్లడించలేదు.

కానీ వైరల్ అవుతున్న ఈ పోస్టుపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. అలాంటి బాస్ తమక్కూడా ఉంటే బాగుండని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు. తమ బాస్ ఎలాంటి వారో కూడా చెబుతూ తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.