ఆ స్టూడెంట్స్‌‌ ఈ హోటల్‌‌లో ఫ్రీగా ఉండొచ్చట

ఆ స్టూడెంట్స్‌‌ ఈ హోటల్‌‌లో ఫ్రీగా ఉండొచ్చట

ఎగ్జామ్‌‌లో ఫెయిలైతే కొందరు పిల్లలు డిప్రెషన్‌‌ బారిన పడతారు. అలాంటి స్టూడెంట్స్‌‌ను త్వరగా కోలుకునేలా చేస్తే, ఈసారి బాగా చదివి పాసయ్యే ఛాన్స్‌‌ ఉంది. అందుకే పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన స్టూడెంట్స్‌‌కు ఒక మంచి ఆఫర్‌‌‌‌ ఇచ్చాడు కేరళకు చెందిన ఒక  హోటల్‌‌ యజమాని. ఫెయిల్​ అయిన స్టూడెంట్స్‌‌ ఫ్రీగా 
తన హోటల్‌‌లో స్టే చేయొచ్చని చెప్పాడు కొడైకెనాల్‌‌లో హోటల్స్‌‌ నడుపుతున్న కేరళకు చెందిన సుధీష్‌‌. తమిళనాడులోని కొడైకెనాల్‌‌ ఫేమస్‌‌ హిల్‌‌ స్టేషన్‌‌ అనే సంగతి తెలిసిందే. కేరళలో టెన్త్​ క్లాస్​ ఫెయిలైన స్టూడెంట్స్‌‌ తన హోటల్‌‌లో ఫ్రీగా ఉండొచ్చని ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్‌‌ చేశాడు. ‘‘పరీక్షల్లో ఫెయిలైన వాళ్లలో చాలామందికి ఆ పరిస్థితిని ఎలా ఫేస్‌‌ చేయాలో తెలియదు. ఒత్తిడికి గురవుతారు.  వాళ్లలోని ఒత్తిడి తగ్గేలా ఏదైనా చేయాలనుకున్నా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని చెప్పాడు సుధీష్‌‌. ఈయన పోస్ట్‌‌ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌‌గా మారింది. దీంతో ఆయనకు చాలామంది స్టూడెంట్స్‌‌ ఫోన్‌‌ చేస్తున్నారట. పేరెంట్స్‌‌తో కాకుండా, తమ ఫ్రెండ్స్‌‌తో వచ్చి ఎంజాయ్‌‌ చేస్తామని అడుగుతున్నారట. కానీ, ఈ ఆఫర్ వాడుకోవాలంటే ఫెయిలైన స్టూడెంట్స్‌‌ తమ పేరెంట్స్‌‌తోనే రావాలని కండిషన్‌‌ పెట్టాడు సుధీష్‌‌. హోటల్‌‌లో ఫ్రీగా  బస చేసే అవకాశంతో పాటు, ఫుడ్‌‌ కూడా ఫ్రీగానే ఇస్తామని చెప్పాడు.