ఒకే ఇంట్లో ముగ్గురు వృద్ధుల ఆత్మహత్య

V6 Velugu Posted on May 25, 2021

  • అనంతపురం జిల్లా పెనుకొండలో ఘటన.. 
  • బ్యాంకు రిటైర్డు ఉద్యోగి అశ్వర్థప్ప, అతని ఇద్దరు సోదరీమణులు గా గుర్తింపు

అనంతపురం: పెనుగొండలో ఒక ఇంట్లో మూడు మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజులుగా తలుపులు తెరచి ఎవరూ బయటకు రాకపోవడం.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా  ముగురు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు బయటపడ్డాయి. రిటైర్డు బ్యాంకు ఉద్యోగి అశ్వర్ధప్ప (65) అతని ఇద్దరు అక్కా చెల్లెళ్లు గా గుర్తించారు. అన్నాచెల్లెళ్లు ముగ్గురు కలసి ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం పెనుకొండలో కలకలం రేపింది. ముగ్గురు కలసి కట్టుగా విష పదార్థం తిని బలవన్మరణానికి పాల్పడినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది తెలియడం లేదు. కరోనా సోకిందనే భయంతోనా.. లేక మరే కారణాలా అన్నది తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

 

Tagged Anantapur District, ap today, , penukonda town, bank retired employee family, rtd employee aswarthappa his two sisters

Latest Videos

Subscribe Now

More News