తిలక్ ఇండియాకు ఆడతాడు

తిలక్ ఇండియాకు ఆడతాడు

ముంబై: ఐపీఎల్15లో సత్తాచాటుతున్న ముంబై ఇండియన్స్ యంగ్ బ్యాటర్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కుర్రాడు తిలక్ వర్మపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌‌‌‌‌‌‌‌ ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలోనే అతడు అన్ని ఫార్మాట్లలోనూ ఇండియాకు ఆడతాడని అభిప్రాయపడ్డాడు. ‘తిలక్ టెక్నిక్​ బాగుంది. చెన్నైపై మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ అతడు మిడిల్ లో బ్యాటింగ్ కు వచ్చి ఒత్తిడిలోనూ అద్భుతమైన పెర్ఫామెన్స్ చేశాడు. సింగిల్స్, డబుల్స్ తో పాటు షాట్లు కూడా బాగా కొడుతున్నాడు. టెక్నిక్‌‌‌‌‌‌‌‌ తోపాటు దూకుడు కలిగి ఉండటం తిలక్‌‌‌‌‌‌‌‌ కు కలిసొచ్చింది. రోహిత్ శర్మ చెప్పినట్లుగా తిలక్ అన్ని ఫార్మాట్లకు సరిపోయే బ్యాటర్. ఇండియా తరఫున కచ్చితంగా ఆడతాడు. అయితే ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ ను కాపాడుకుంటూ ముందుకు సాగడం తిలక్ చేతిలో ఉంది’ అని గావస్కర్ చెప్పాడు.