
ఆన్లైన్ క్లాస్‌లు వినేందుకు స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో కొనుక్కునేందుకు అవసరమైన పైసల కోసం ఓ స్టూడెంట్ కూలీగా మారాడు. మెదక్‌జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లి గడ్డ తండాకు చెందిన పవన్ నర్సాపూర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్నాడు. కరోనాతో కాలేజీ నడవడం లేదు. కూలి పనిచేసే తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేక పోయారు. దీంతో ఆన్లైన్ క్లాసులు వినేందుకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌ను ఎలాగైనా కొనుక్కోవాలన్న పట్టుదలతో కొద్ది రోజులుగా పొలం పనులకు కూలీగా వెళ్తున్నాడు. ఊరిలో వ్యవసాయ పనులు లేనపుడు మేడ్చల్‌కు వెళ్లి అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. - మెదక్/శివ్వంపేట, వెలుగు