ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అడవి శేష్

V6 Velugu Posted on Sep 27, 2021

  • డెంగ్యూ సోకడంతో ఈనెల 18న ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్న హీరో అడవి శేష్

హైదరాబాద్: టాలీవుడ్ వర్తమాన హీరో అడవి శేష్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. డెంగ్యూ బారిన పడడంతో రక్తంలో  ప్లేట్ లెట్ల సంఖ్య  తగ్గిపోవడంతో ఈనెల 19వ తేదీన నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. రికవరీ కావడంతో ఇవాళ ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. 
టాలీవుడ్ వర్ధమాన హీరో అడవి శేష్ ‘గూఢచారి.. ఎవరు’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు చేసి తక్కువ సినిమాలతోనే ప్రత్యేకత నిరూపించుకున్నారు. హఠాత్తుగా డెంగ్యూ బారినపడడంతో ఆయన నటిస్తున్న ‘మేజర్’ సినిమా చిత్రం షూటింగు ఆగిపోయినట్లు తెలుస్తోంది. అడవిశేష్ తిరిగి రావడం కోసం సినిమా యూనిట్ ఎదురు చూస్తోంది. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాను ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథను ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న అడవి శేస్ ట్వీట్ లో ఇంటికి తిరిగి వచ్చేశానని.. పూర్తిగా కోలుకుంటున్నానని అభిమానులకు తెలియజేశారు. 

https://twitter.com/AdiviSesh/status/1442347912910962688?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1442347912910962688%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fadivi-sesh-discharged-hospital-after-recovering-drom-dengue-1399042


 

Tagged tollywood, telugu movies, discharged from hospital, Telugu film industry, , adavi sesh, hero Adavi Shesh, infected with dengue, adavi sesh health updates, adavi sesh returned to home

Latest Videos

Subscribe Now

More News