ఇండియా, బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేశాలతో పాటు క్రికెట్ లో కూడా ఇండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆడేందుకు సిద్ధంగా లేమని గట్టిగా చెబుతుంది. ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నా ఆ దేశ క్రికెట్ మాత్రం ఖరాఖండిగా ఆడేది లేదని గట్టిగా చెప్పుకొస్తుంది. ఇలాంటి సమయంలో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మాదే ప్రస్తుతం రెండో వన్డే జరుగుతుంది. బుధవారం (జనవరి 14) రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ బంగ్లాదేశ్ కావడం చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌కు చెందిన అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ సైకత్ ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు. తొలి వన్డేకు కూడా షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ ఆన్ ఫీల్డ్ అంపైర్ గా ఉండడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో కూడా కూడా ఆయన అంపైరింగ్ బాధ్యతలను స్వీకరించారు. అంతర్జాతీయ మ్యాచ్ జరిగేటప్పుడు అధికారులను ఐసీసీ నియమిస్తుంది. బీసీసీఐ గానీ BCB ప్రమేయం ఉండదు.
ఐసీసీ నియమించడంతో రెండు జట్లు బోర్డులు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. దీంతో షర్ఫుద్దౌలా ఇబ్నే తన అంపైరింగ్ బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇబ్నే షాహిద్ సైకత్ మార్చి 2024 నుండి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌గా ఉన్నారు. ఇప్పటివరకు ఈ బంగ్లాదేశ్ అంపైర్ 32 టెస్టులు, 119 వన్డేలు, 75 టీ20 మ్యాచ్ లకు అంపైరింగ్ చేశాడు. అంతేకాదు ప్రస్తుతం BCB అంపైర్ విద్యా విభాగానికి అధిపతిగా ఉన్నాడు. ఈ బంగ్లా అంపైర్ భారత్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో కూడా అంపైర్ గా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాహుల్ సెంచరీతో ఇండియా భారీ స్కోర్:
ఈ మ్యాచ్ విషయానికి వస్తే బుధవారం (జనవరి 14) రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసి టీమిండియాకు డీసెంట్ టోటల్ అందించాడు. రాహుల్ తో పాటు గిల్ (56) హాఫ్ సెంచరీతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. రాహుల్ 112 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, జకారీ ఫౌల్క్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీనుకున్నారు.
