రేపు పాక్షిక చంద్ర గ్రహణం

రేపు పాక్షిక చంద్ర గ్రహణం
  • ఈ ఏడాదిలో మొదటి గ్రహణం
  • మన దేశంలో ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే..

న్యూఢిల్లీ: రేపు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనుండగా ఇది మొదటి చంద్ర గ్రహణం. బుధవారం వైశాఖ పూర్ణిమ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్ర గ్రహణం ప్రత్యేకత ఏంటంటే ఇది భారతదేశంలో చాలా ప్రాంతాల్లో కనిపించదు. ఎందుకంటే ఈ గ్రహణం ప్రారంభమైనప్పుడు మన దేశంలో ఎక్కువ భాగం పగలు ఏర్పడుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన దేశంలో సాయంత్రం ఏర్పడే ఈ చంద్ర గ్రహణం ఈశాన్య రాష్ట్రాలు అయిన అరుణాచల్ ప్రదేశ్ , మిజోరాం , బంగాల్ , నాగాలాండ్ , త్రిపుర , తూర్పు ఒడిషా , మణిపుర్ , అసోం , మేఘాలయ రాష్ట్రాలలో కనిపిస్తుంది. భారత్ తో పాటు చంద్ర గ్రహణం జపాన్ , బంగ్లాదేశ్ ,  సింగపూర్ , మయన్మార్ , దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ , ఉత్తర అమెరికా , దక్షిణ అమెరికా పసిఫిక్ , హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. భారత్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణం సూతక కాలం పరిగణనలోకి తీసుకుంటారు.

పంచాంగం ప్రకారం చంద్ర గ్రహణం
 పంచాంగం ప్రకారం 2021 మే 26 బుధవారం ఉదయం 06.15 గంటలకు గ్రహణ కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాలు, ఇంట్లో పూజా మందిరాలు, ప్రార్థానా స్థలాలు మూసివేస్తారు. అలాగే ఈ సమయంలో భగవంతుడిని తాకరు. దీంతో పాటు దేవాలయంలో కూడా ఆరాధన కార్యక్రమాలు నిర్వహించరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుభ్రపరిచడం ద్వారా ఆరాధన పనులు ప్రారంభమవుతాయి. సూతక కాలం గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు ప్రారంభవుతుంది. గ్రహణం ముగిసే వరకు ఉంటుంది.

​చంద్ర గ్రహణం 2021 సమయం, వివరాలు
సూతక కాలం ఆరంభం: ఉదయం 06.15 గంటలకు

గ్రహణం ఆరంభం: మధ్యాహ్నం 03.00 గంటలకు
ఖాగ్రాస్ ప్రారంభం: మధ్యాహ్న 4.40 గంటలకు

గ్రహణ మధ్య కాలం: 04.49 గంటలకు

గ్రహణం ముగింపు: 06.23 గంటలకు..

​చంద్ర గ్రహణం ప్రభావం..

వైశాఖ పూర్ణిమ రోజు గ్రహణం కారణంగా బీహార్, ఒడిశా, పశ్చిమ బంగాల్, తూర్పు రాష్ట్రాలకు ఈ గ్రహణ ప్రభావ వంతంగా ఉంటుంది. ఈ చంద్ర గ్రహణం బ్రెజిల్, అల్జీరియా, మయన్మార్ లాంటి దేశాలకు ఉపయోగపడుతుంది. ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనుండడి వీటిలో మొదటిది ఈ చంద్రగ్రహణం. ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం జూన్ 10న ఏర్పడనుంది. రెండోది డిసెంబరు 4న సంభవించనుంది. దీంతో మొదటి చంద్ర గ్రహణం మే 26న, రెండో చంద్ర గ్రహణం నవంబరు 19న ఏర్పడుతుంది.