టూరిస్ట్ పడవ బోల్తా..11 మంది మృతి

టూరిస్ట్ పడవ బోల్తా..11 మంది మృతి

కేరళ రాష్ట్రంలో  విషాదం సంఘటన  చోటు చేసుకుంది. మలప్పురం జిల్లాలో పర్యాటకుల పడవ బోల్తా పడి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 15 మందికి పైగా గల్లంతయ్యారు.  పురపుజా నదిలో మే 07వ తేదీ  రాత్రి 7 గంటలకు ఈ ఘటన జరిగింది.

మే7వ తేదీ ఆదివారం 30తో కూడిన పడవ పురపుజా నదిలో వెళ్తుండగా..తూవల్ తీరం టూరిస్ట్ స్పాట్ వద్ద బోల్తా పడింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, స్థానిక మత్స్యకారులు సహాయక చర్యలు ప్రారంభించారు.  ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్లు కేరళ మంత్రి వి అబ్దురహిమాన్ వెల్లడించారు. మృతి చెందిన  వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ప్రమాదం నుంచి 10 మందిని కాపాడినట్లు ఆయన వెల్లడించారు. అయితే  గల్లంతైన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా వున్నారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 

పడవలో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  దీనికి తోడు పడవలో ప్రమాదాన్ని నివారించే పరికరాలు ఏమీ లేవు. అయితే గమ్యానికి 300 మీటర్ల దూరంలో ఉండగా.. పడవ  బోల్తా పడింది. ఈ పడవలోని ప్రయాణీకుల్లో ఎక్కువ మంది  మలప్పురం జిల్లాలోని పరప్పనంగడి, తానూర్ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం.  అయితే కేరళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ తరహా పడవలు నడిపేందుకు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంది. కానీ నిబంధనలను అతిక్రమించి సాయంత్రం 7 గంటల వరకు నడపడం గమనార్హం.