కొడుకుతో ఆడుకుంటూ సముద్రంలో గల్లంతయిన తండ్రి

కొడుకుతో ఆడుకుంటూ సముద్రంలో గల్లంతయిన తండ్రి

భువనేశ్వర్: ఒడిశాలోని పూరి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు నీళ్లలో ఆడుకుంటుండగా పెద్ద కెరటం ధాటికి తండ్రి కొట్టుకుపోయాడు. 12 ఏళ్ల పిల్లాడు క్షేమంగానే ఉన్నాడు. బాలాసోర్‌‌కు చెందిన చిరు వ్యాపారి బన్సీధర్ బెహెరా(35) కుటుంబసభ్యులతో కలసి పూరీ వెళ్లారు. శనివారం తండ్రీకొడుకులు సరదాగా బీచ్‌లో స్నానం చేశారు. ఓ ఫ్యామిలీ మెంబర్ వారిని వీడియో తీశారు. ఇంతలో ఓ పెద్ద కెరటం రావడం గమనించి, బన్సీధర్‌ ఎదురెళ్లి నీళ్లలో దూకాడు. ఆ కెరటంతో పాటే సముద్రంలోకి కొట్టుకుపోయాడు. బన్సీధర్​ కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడే ఉన్న లైఫ్ గార్డులకు సమాచారం అందించారు. అతని కోసం డైవర్లు వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. బన్సీధర్ డెడ్​బాడీ కూడా దొరకలేదని అధికారులు చెప్పారు.