వర్షాలతో నిలిచిపోయిన రాకపోకలు.. డ్రోన్లతో మందుల సరఫరా

V6 Velugu Posted on Sep 28, 2021

వర్షాలతో రాకపోకలు నిలిచిపోవడంతో మందుల సరఫరాకు డ్రోన్లను వినియోగించారు కామారెడ్డి జిల్లా అధికారులు. పిట్లం మండలం కుర్తిలో కన్నయ్య అనే 16 నెలల బాలుడు జ్వరంతో బాధపడ్తున్నాడు. అయితే వానలతో ఆ గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో వైద్య శాఖ సిబ్బంది డ్రోన్లతో మందులు పంపించారు. కన్నయ్యతో పాటు గ్రామస్తులకు అత్యవసర మందులు సప్లై చేశారు.  డ్రోన్లతో మందులు పంపిణీ చేసినందుకు కుర్తి గ్రామస్తులు వైద్య శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Tagged Kamareddy District, supply, Drones, Rains, Medicine,

Latest Videos

Subscribe Now

More News