ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రాథమిక ‘కీ’ విడుదల

ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రాథమిక ‘కీ’ విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఇంజనీరింగ్ ప్రాథమిక ‘కీ’ ని ఇవాళ విడుదల చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలను ఈనెల 18, 19,20వ తేదీల్లో రెండు విడుతలుగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ ని ఎంసెట్ కన్వీనర్ మరియు జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ గోవర్ధన్ విడుదల చేశారు. ప్రాథమిక కీ ఇవాళ్టి నుండి ఆగస్టు 1 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ సైట్ (https://eamcet.tsche.ac.in)లో కీ అందుబాటులో ఉంటుందని కన్వీనర్ తెలిపారు.