గణపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

గణపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి/ఖిల్లాగణపురం, వెలుగు :  వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండల కేంద్రంలోని చారిత్రక గణపురం ఖిల్లాను రూ.2 కోట్లతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ఆయన ఖిల్లా ట్రెకింగ్‌‌లో పాల్గొని కోటలోని విశేషాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, అప్పటి పాలకుల ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని కొనియాడారు. గణపురం ఖిల్లా అభివృద్ధి కోసం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించామని, త్వరలోనే ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్  వినోద్ కుమార్, డీవైఎస్‌‌ఓ సుధీర్ రెడ్డి, సీపీఓ హరికృష్ణ, నాయకులు సాయి చరణ్ రెడ్డి, ఆగారం ప్రకాష్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.