దళితబంధులో 47 రకాల బిజినెస్​లు

దళితబంధులో 47 రకాల బిజినెస్​లు
  • లబ్ధిదారులు నచ్చింది ఎంచుకునే చాన్స్‌‌
  • ఏమేం పనులు చేసుకోవచ్చో చెప్పిన సర్కార్​
  • ఇవి కాకుండా కొత్త బిజినెస్‌‌ ప్లాన్‌‌ చేసినా అనుమతి

హైదరాబాద్‌‌, వెలుగు: దళిత బంధు పథకం డబ్బులతో ఏమేం బిజినెస్​లు చేసుకోవచ్చో ప్రభుత్వం సూచించింది. 47 రకాల బిజినెస్​లతో ఒక లిస్ట్ రూపొందించింది. లిస్ట్​లో సూచించిన బిజినెస్‌‌లలో లబ్ధిదారులు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. ప్రభుత్వం గుర్తించిన ఈ పనులకు ‘తెలంగాణ దళిత బంధు సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా’ అనే పేరు పెట్టారు. ఇవే కాకుండా లబ్ధిదారులు తమకు ఇష్టమైన, ఇతర కొత్త బిజినెస్ ప్లాన్ ఏదైనా సూచిస్తే పరిశీలించి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించింది. గ్రామాలు, పట్టణాల్లో ఏయే బిజినెస్లు చేయొచ్చో జాబితాలో పొందుపర్చారు. దీనికోసం ప్రత్యేకంగా రూరల్, సబ్ అర్బన్, అర్బన్ ప్రాంతాల వారీగా బిజినెస్​లను విభజించారు. బిజినెస్ కాస్ట్ రూ.10లక్షల కంటే తక్కువగా ఉంటే రెండు నుంచి మూడు యూనిట్లుగా కూడా పెట్టుకోవచ్చు. ఒక యూనిట్ లబ్ధిదారుడుగా నడిపిస్తూ.. ఇతర యూనిట్లను ఇతరులను పెట్టి నడిపించుకునేలా ప్లాన్ చేశారు.

గ్రామీణ  ప్రాంతాల్లో..

మినీ డెయిరీ యూనిట్(10 నుంచి 12 బర్రెలు), పందిరి కూరగాయల సాగు, వరినాటు యంత్రాలు + పవర్ టిల్లర్, వేపనూనె పిండి తయారీ, ఆటో ట్రాలీ పథకాలు ఉన్నాయి.

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో..

వ్యవసాయ సాగు కోసం యంత్ర పరికరాల సేల్స్, మట్టి ఇటుకల తయారీ + ఆటో ట్రాలీ, ట్రాక్టర్, ట్రాలీ, కోళ్ల పెంపకం+ఆటో ట్రాలీ (సుగుణ, వెంకోబ్ ఫ్రాంచైసీ) స్కీంలున్నాయి.

గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్  ప్రాంతాల్లో..

సెవన్ సీటర్ ఆటో, ప్యాసింజర్ ఆటో రిక్షా, త్రీ వీలర్ ఆటో ట్రాలీ, విత్తనాలు లేదా ఎరువుల, క్రిమిసంహారక మందుల దుకాణం (ప్రభుత్వ అనుమతితో), టెంట్ హౌస్+ డెకరేషన్ లైటింగ్, సౌండ్ సిస్టమ్ + టు ఆటో ట్రాలీ, మడిగల నిర్మాణంతో వ్యాపారం, ఆయిల్ మిల్, పసుపు, కారం, బియ్యం పిండి గిర్నీ స్కీంలున్నాయి.

సెమీ అర్బన్, అర్బన్  ప్రాంతాల్లో..

ప్యాసింజర్స్, గూడ్స్కు ఫోర్ వీలర్ వెహికల్, ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్స్, డయాగ్నస్టిక్ ల్యాబ్ + మెడికల్ షాప్, ఎలక్ట్రికల్ షాప్ + బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీసెస్, హార్డ్ వేర్, సానిటరీ షాప్ + ఆటో, సిమెంట్ ఇటుకలు లేదా రింగుల తయారీ,  ప్రీ కాస్టింగ్ స్ట్రక్చర్+ ఆటో ట్రాలీ, సెంట్రింగ్ లేదా ఆర్సీసీ రూఫ్ మేకింగ్ (స్టీల్, ఉడెన్), కాంక్రీట్ రెడీ మిక్స్ తయారీ యంత్రం, యాక్రిలిక్ షీట్స్, టైల్స్ వ్యాపారం+ఆటో ట్రాలీ పథకాలున్నాయి. హోటల్, క్యాటరింగ్ సర్వీస్ (దాబా) + ఆటో ట్రాలీ, ఐరన్ గేట్స్, గ్రిల్స్ తయారీ యూనిట్ + ఆటో ట్రాలీ, మెడికల్, జనరల్ స్టోర్స్, మినీ సూపర్ బజార్, డీటీపీ, మీసేవ, సీఎస్సీ ఆన్ లైన్ సర్వీస్, ఫొటో స్టుడియో, బిల్డింగ్ మెటీరియల్ స్టోర్స్ లేదా హార్డ్ వేర్, మార్బుల్ పాలిషింగ్, గ్రానైట్ కటింగ్ లేదా పీవోపీ, ఫుడ్ రెస్టారెంట్, సిమెంట్ లేదా స్టీల్ షాప్ (సబ్ డీలర్ షిప్), పశువులు, కోళ్లదాణా తయారీ కేంద్రం +ఆటో ట్రాలీ, చెప్పులు, లెదర్ గూడ్స్ షాపు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ డ్రోన్ కెమెరా (అన్ని ఫంక్షన్ల కోసం), ప్రభుత్వ అనుమతులతో రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు కూరగాయలు, ఆహార పదార్థాల సరఫరా కోసం రెండు ఆటో ట్రాలీలను అందించే స్కీంలున్నాయి.

అర్బన్ ప్రాంతాల్లో..

మొబైల్ టిఫిన్ సెంటర్ (4 వీలర్స్), క్లాత్ ఎంపోరియం టెక్స్ టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ షోరూం, పేపర్ ప్లేట్స్ లేదా గ్లాసెస్ లేదా బ్యాగ్స్, తయారీ యూనిట్+ ఆటో ట్రాలీ, కార్ టాక్సీ(క్యాబ్), ఎంబ్రాయిడరీ, టైలరింగ్ లేడీస్ ఎంపోరియం, కిచెన్ వేర్ – ఫర్నీచర్ షాప్ (సేల్స్, సర్వీస్), ఫ్లెక్సీ లేదా వినైల్ డిజిటల్ ప్రింటింగ్+ఆటో ట్రాలీ, డిజిటల్ ఫొటో స్టుడియో ల్యాబ్, ఆటో మొబైల్ షాప్ -సర్వీసింగ్ యూనిట్, డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, పేపర్ న్యాప్కిన్స్ సేల్స్ షాప్ పథకాలున్నాయి.