నా వ్యాఖ్యలను తప్పుదారి పట్టించేలా రాశారు.. సరిచేయండి: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

నా వ్యాఖ్యలను తప్పుదారి పట్టించేలా రాశారు.. సరిచేయండి: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ఓ ప్రముఖ పత్రికలో సజ్జనార్ గందరగోళాన్ని సృష్టంచాడు అనే శీర్షికతో రాసిన కథనంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆందోళన వ్యక్తంచేశారు. గంటసేపు ప్రెస్ కాన్ఫ రెన్స్ పెట్టి వివరణలు ఇచ్చినప్పటికీ తప్పుడు కథనాలు రాయడం తనను నిరాశ, తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంపై నిన్న (డిసెంబర్ 8న) రాష్ట్రప్రభుత్వం  ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జనార్.. తన వివరణను ఓ పత్రిక తప్పుగా రాసిందని.. దయచేసి వెంటనే దానిని సవరించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. 

ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు లో భాగంగా మహాలక్ష్మీ పథకాన్ని డిసెంబర్ 9 నుంచి అమలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.. ఈ క్రమంలో మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉన్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్  ప్రెస్ మీట్ పెట్టి అమలు సంబంధించిన వివరాలను తెలియజేశారు. అయితే మహాలక్ష్మీ పథకంపై తాను వివరించిన వాటిని కాకుండా..వక్రీకరించే విధంగా ఓ ప్రముఖ పత్రిక రాసిందని.. దీనిని తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామన్నంటూ ఓ ప్రకటన చేశారు. దయచేసి ఆ వార్తను సరిచేయాలని కోరారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట రెండు గ్యారంటీలను కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా  ఇవాళ్టి (డిసెంబర్ 9) నుంచి అమలు చేస్తున్నారు. మిగిలిన గ్యారంటీలను కేబినెట్ లో చర్చించి అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.