
ఖమ్మం జిల్లా మధిరలో ఏటీఎం చోరీకి ప్రయత్నించారు ఇద్దరు యువకులు. మాస్కులు పెట్టుకొని రోడ్డుపై ఎవ్వరూ లేనప్పుడు రైల్వే గేట్ సమీపంలోని ఏటీఎం దగ్గరకు వెళ్లారు. ఒకరు బయట కాపలా ఉండగా, మరొకరు రాడ్డుతో ఏటీఎం పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఎంతకు ఏటీఎం పగలకపోవడంతో విసుగుపుట్టి ఇద్దరు యువకులు వెళ్లిపోయారు. చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.