జంగిల్ రాజ్ ప్రభుత్వం తిరిగి రాకుండా అడ్డుకుంటాం

జంగిల్ రాజ్ ప్రభుత్వం తిరిగి రాకుండా అడ్డుకుంటాం
  • యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 

లక్నో: బిహార్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అరాచకత్వానికి పాల్పడేవారిని సహించబోదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ ప్రభుత్వం తిరిగా రావడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రయత్నాన్ని అధికార ఎన్డీయే పక్షాలు అడ్డుకుంటాయని చెప్పారు. సమగ్రాభివృద్ధి కోసం ఎన్డీయేకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నేరస్తులతో చేతులు కలిపే ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి శక్తులు బిహార్ ప్రజలకు అవసరం లేదని వెల్లడించారు. 

బిహార్ లోని సివాన్ జిల్లా రఘునాథ్ పూర్ లో జరిగిన ర్యాలీలో యోగి పాల్గొని మాట్లాడారు. ‘‘బిహార్ లో మాఫియా రాజ్ ను పునరుద్ధరించాలని శక్తులు చురుగ్గా ఉన్నాయి. అయితే, వాటిని మొగ్గలోనే తుంచేయాలి. బిహార్‌ లో ‘జంగిల్ రాజ్’ ప్రభుత్వం తిరిగి రావడాన్ని అడ్డుకోవాలని అన్ని ఎన్డీయే మిత్రపక్షాలు నిర్ణయించుకున్నాయి. బిహార్ లోని ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం అరాచకాన్ని సృష్టించే వారిని సహించదు. బుల్డోజర్ తో  సమాధానం ఇస్తుంది” అని పేర్కొన్నారు.