వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుతుంటాయి. ఇలా మారినప్పుడు దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన కనిపిస్తుంది. గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు ధనుస్సురాశిలో 2025 డిసెంబర్ 16వ తేదీన ఉదయం 4.27 గంటలకుసూర్యుడు సంచరించనున్నాడు. అదే రాశిలో 2026 జనవరి 14 వరకు కొనసాగుతాడు. సూర్య సంచారంలో మార్పు వలన ఆరు రాశుల(మేషం, మిథునం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ) వారి జీవితంలో సానుకూలమైన ఫలితాల కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .
మేషరాశి: సూర్యుడు తొమ్మిదవ ఇంట్లో సంచరించడం వలన ఈ రాశి వారి జీవితాల్లో పెద్ద మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆర్థిక లాభాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది..పెళ్లికోసం ఎదురు చూసేవారికి ఉన్నత కుటుంబంలో వారితో సంబందం కుదురుతుంది.
మిథునరాశి: సూర్యుడు ఏడవ ఇంట్లో సంచరించడం ఈ రాశి వారికి గ్రహబలం పెరుగుతుంది. వృత్తి.. ఉద్యోగాల రీత్యా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. దాంపత్య సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
సింహరాశి : ఈ రాశి ఐదవ ఇంట్లో సూర్యుడు సంచరించడంవలన చాలా ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా చాలా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేతి వృత్తుల వారికి ఆశించిన దానికంటే ఎక్కువ ఆర్డర్లు వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. పిల్లల కోసం సంతాన యోగం కలుగుతుంది. నిరుద్యోగులు జాబ్ ఆఫర్ లెటర్స్ అందుకుంటారు. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
వృశ్చికరాశి: ఈ రాశి నాల్గవ ఇంట్లో ధనస్సు రాశిలో సూర్యుడు సంచరించడం వలన ఆనందం, సౌఖ్యం పెరుగుతాయి. అదృష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ఎన్నడూ చూడని ఆర్థిక లాభాలు ఉంటాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందు తాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
ధనుస్సు రాశి : సూర్యుడు ఇదే రాశిలో సంచారం కారణంగా కెరీర్ పురోగతి, ప్రమోషన్ లభిస్తాయి. జీవితంలో కొత్త మార్పులు ఉంటాయి. ప్రశాంతత నెలకొంటుంది. స్థాయి, హోదా, జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సమాజంలో అత్యంత ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు అనుకోకుండా ప్రమోషన్ అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు. . .
కుంభరాశి: ఈ రాశి 11 వ ఇంట్లో సూర్యుడు సంచారం వలన .. కుంభరాశి వారి పనిలో ఎన్నడూ ఊహించని పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి కలుగుతాయి. మీను అనుకున్న లక్ష్యిన్ని అందుకొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్రహాల యాక్టివిటీ పెరుగడంతో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. మనసులోని కోరి కలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
►ALSO READ | గుర్తుండిపోయేది కవులూ.. వాళ్ల చరణాలూ.. రచయితలకు, కవులకు సమాజంలో విశిష్ట స్థానం
