- చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేలా ‘నేవీ సీల్స్’కు స్పెషల్ ట్రైనింగ్
- 2011లో పాక్‌లోకి చొచ్చుకెళ్లి లాడెన్‌ను హతమార్చిన టీమ్ ఇదే
న్యూయార్క్: చైనా నుంచి ఎప్పుడైనా తమకు ముప్పు పొంచి ఉందని భయపడ్తున్న తైవాన్‌కు సాయం చేసేందుకు అమెరికా రెడీ అవుతున్నది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ‘నేవీ సీల్స్ 6’ టీమ్‌కు శిక్షణ ఇస్తున్నది. అమెరికా చేపట్టే స్పెషల్ కోవర్ట్ ఆపరేషన్స్‌లో ఈ కమెండో టీమ్ ముందుంటుంది. 2011 పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి మరీ అల్ ఖాయిదా టెర్రరిస్టు ఒసమా బిన్ లాడెన్‌ను ఈ బృందమే హతమార్చింది.
ఇదే టీమ్ ఇప్పుడు తైవాన్‌కు సాయం చేసేందుకు అమెరికాలోని వర్జీనియా బీచ్‌లోని డామ్నెక్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు ఫైనాన్సియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఏ క్షణమైనా తైవాన్‌పై చైనా యుద్ధం చేసే అవకాశం ఉందన్న యూఎస్ ఇండో పసిఫిక్ కమాండర్ హెచ్చరికల దృష్ట్యా ఈ ఏడాది నుంచే సీల్స్ బృందం శిక్షణ పొందుతున్నది. తైవాన్ను శాంతియుతంగా విలీనం చేసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చైనా చెప్తున్నది. అయితే.. చైనా తీరుతో కొన్నాళ్లుగా తైవాన్బార్డర్లో ఉద్రికత్త నెలకొంది.