ఈమెకు భర్తను వెతికి పెడితే రూ.4 లక్షలు ఇస్తుందట.. ఇంతకీ అబ్బాయి ఎలా ఉండాలంటే..

ఈమెకు భర్తను వెతికి పెడితే రూ.4 లక్షలు ఇస్తుందట.. ఇంతకీ అబ్బాయి ఎలా ఉండాలంటే..

ఈ రోజుల్లో చాలా మంది సింగిల్ గా ఉండేందుకే ఇష్టపడుతున్నారు. మరికొందరేమో పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతున్నా సంబంధాలు కలిసి రాక వయసు పెరుగుతున్నా పెళ్లి కాకుండా అలానే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా తనకు భర్తను వెతికి పెట్టాలని కోరుతోంది. అయితే మాకేంటీ అనుకుంటున్నారా.. ఫ్రీగా ఏం చేయాల్సిన అవసరం లేదు. తనకు జోడీని వెతికి పెడితే 5వేల డాలర్లు అంటే మన కరెన్సీలో అయితే రూ.4లక్షల పైనే అన్నమాట.. ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది.

లాస్ ఏంజెల్స్‌కు చెందిన 35 ఏళ్ల కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీ ఈవ్ టిల్లీ-కౌల్సన్ తను వివాహం చేసుకోబోయే వ్యక్తితో కలిపేందుకు సహాయపడాలంటూ అప్పీల్ చేస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. టిక్‌టాక్‌లో 10లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె.. ఈ వీడియో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ గా అయింది. అయితే తన స్నేహితులు గానీ, మరెవరు గానీ తనకు సరైన జోడీని కనుగొనలేకపోయారని, అందుకే ఈ ఆఫర్ ను టిక్ టాక్ లోని ఫాలోవర్లకు విస్తరించాలని కౌల్సన్ భావించి ఈ నిర్ణయం తీసుకుందట. ఆమె ఇప్పుడు ఫాలోవర్లు.. తనకు ఆదర్శవంతమైన భాగస్వామిని వెతకమని ఆహ్వానిస్తోంది. వారిలో ఎవరైనా సఫలమైతే, అప్రిసియేషన్ టోకెన్‌గా ముందు చెప్పినట్టుగానే వారికి 5వేల డాలర్లు (సుమారు రూ. 4.16 లక్షలు) సంతోషంగా ఇస్తానని పేర్కొంది.

తన పార్ట్ నర్ కోసం ఆన్‌లైన్ కమ్యూనిటీని ఆశ్రయించిన కౌల్సన్.. తనకు సహాయం చేయమని TikTok యూజర్స్ ను కోరుతోంది. అయితే ఈవ్.. తన వివాహంపై మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. తనను చేసుకుంటే ఎక్కువకాలం తనతో ఉండాల్సిన అవసరమేం లేదని, ఎందుకంటే తాను 20ఏళ్లలోపు విడాకులు ఇచ్చేస్తానని అందరికీ షాక్ ఇచ్చింది. అయినప్పటికీ, తన కాబోయే భర్తను తనకు పరిచయం చేస్తే.. ఇచ్చిన వాగ్దానం ప్రకారం అది ఎవరైనా సరే.. వారికి మాత్రం బహుమతిని అందించడానికి కట్టుబడి ఉన్నట్టు నొక్కి చెప్పింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Eve Tilley-Coulson (@ebtilley)

ఈవ్ తన కాబోయే భర్తలో తాను కోరుకునే నిర్దిష్ట లక్షణాలను కూడా వెల్లడించింది. వయస్సు విషయానికొస్తే అతను 27 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలని కోరింది. క్రీడా ఔత్సాహికులై, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని, తనకు కనిపించాలని చెప్పుకొచ్చింది. కనీసం ఆరు అడుగుల ఎత్తుతో పాటు, అతనికి మంచి తెలివితేటలు, మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలని కోరుకుంటుందట.

 

న్యూయార్క్ పోస్ట్ నివేదించిన ప్రకారం.. కౌల్సన్ వీడియో వైరల్ అయ్యింది. ఈవ్ వైరల్ వీడియో ఇప్పటికే 5లక్షల 56వేల వ్యూస్ ను అందుకుంది. ఇలా ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫొటోలు ఈ లెవల్లోనే వైరల్ అవుతుంటాయి.

అయితే ఈవ్ కు సంబంధాలు రావడం లేదా అనుకోకండి.. ఆమెకు ఇప్పటివరకు 25కి పైగా ఆఫర్‌లు వచ్చినప్పటికీ, ఆమె ఇంకా ఏ డేట్స్ కీ వెళ్లలేదట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో ఆమె ఆఫర్‌పై ఆసక్తిని వ్యక్తం చేసిన మధ్యవర్తులలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారట. అయినప్పటికీ విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆమెకు సరైన సరిపోలికను కనుగొనడంలో సహాయపడటానికి ఉత్సాహంగా ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.