యూపీ కేబినెట్ విస్తరణ.. కొత్తగా ఏడుగురికి ఛాన్స్

V6 Velugu Posted on Sep 26, 2021

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర  కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రివర్గంలో కొత్తగా ఏడుగురికి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జితిన్ ప్రసాద్ తోపాటు మరో ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
కొత్త మంత్రివర్గంలో జితిన్ ప్రసాదతోపాటు ధర్మవీర్ ప్రజాపతి, దినేష్ ఖడిక్, సంజీవ్ కుమార్, సంగీత్ బల్వంత్, పట్లు రామ్, ఛత్రపాల్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మంత్రివర్గ విస్తరణ జరగడం విశేషం. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఘనవిజయమే టార్గెట్ గా పెట్టకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు స్పష్టం అవుతోంది. 
 

Tagged UP CM, UP CM Yogi Adityanath, , up updates, up cabinet expansion, up new ministers, new ministers take oath, 7 new in up cabinet

Latest Videos

Subscribe Now

More News