
సెప్టెంబర్ 23 నుండి అంటే రేపటి నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ ద్వారా భారీ ఆఫర్ల పేరుతో ఇప్పటికే కస్టమర్లను ఆకట్టుకుంటూ, ఈ షాపింగ్ సందడి వెనుక ఉన్న ఒక అసలు విషయాన్నీ వీడియో ద్వారా వెలుగులోకి తెచ్చింది. మార్కెటింగ్ ఉద్యోగి సిమ్రాన్ భంబాని షేర్ చేసిన వీడియోలో బెంగళూరు ఆఫీసుకి పరుపులు, దిండ్లు ట్రక్కులో డెలివరీ చేస్తున్నట్లు కానిపిస్తుంది. సిమ్రాన్ భంబాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ క్లిప్‌ను 17 అలక్షలకు పైగా చూసారు.
అయితే పండగ సీజన్ బిజీ సమయంలో రాత్రిపూట ఉద్యోగులు ఆఫీసులోనే ఉండేందుకు ఈ పరుపులు, దిండ్లు తెచ్చినట్లు ఆమె వివరించారు. ఈ వీడియో కింద ఆమె ఇది ఒక లాంగ్ వీకెండ్ లాంటిది అని చెప్తూ... అవును, మేము ఆఫీసులో రాత్రి నిద్రపోతాం అని పేర్కొన్నారు.
ఈ పోస్ట్ పై ఆన్‌లైన్‌లో చాలారకాల కామెంట్లు వచ్చాయి. కొంతమంది ఎక్కువ పనివేళల గురించి మాట్లాడగా, మరికొందరు మార్కెటర్లు అర్థరాత్రుల్లో ఎం చేస్తారు అంటూ అడిగారు... కొంతమంది పనిభారం గురించి ప్రశ్నలు కురిపించగా.. ఇంకోకరు ఎందుకు అంత పని ? మీరు ప్రతి గంటకు మాన్యువల్‌గా ధరలను అప్‌డేట్ చేస్తారా ? అని అడిగారు.
కొంతమంది అయితే దీనిని విషపూరితమైన పని సంస్కృతిలో భాగం అని, మరొకరు ఈ రోజుల్లో విషపూరిత పని సంస్కృతిని పొగడటం ఒక అలవాటు అయ్యింది అని అన్నారు. ఇంకొకతను కూడా ఇదే విధంగా మీరు దీని గురించి గర్వపడుతున్నారా ? నవ్వుతున్నారా? మనం ఈ పని సంస్కృతిని ప్రోత్సహించకూడదని అన్నారు.
మరొక నెటిజన్ మాట్లాడుతూ దీన్ని తేలికగా తీసుకోకూడదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ (Work-life balance) చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు, భారతదేశంలో ఇది ఒక అపోహలా ఉంది. ఇలాంటి విషపూరిత పద్ధతులను పొగిడే బదులు, మనకు ఆరోగ్యకరమైన పని సంస్కృతి అవసరం అని అన్నారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు సెప్టెంబర్ 22 నుండి ముందే ఆక్సెస్ ఇచ్చింది. ఇంకా ఫోన్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులపై భారీ డిస్కౌంట్లు, కళ్ళు చెదిరే ఆఫర్లు ఇంకా మరెన్నో అందిస్తుంది.