ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్: సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే పార్టీలో మెరిసిన ఎంఎస్ ధోని

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్: సల్మాన్ ఖాన్ 60వ బర్త్‌డే పార్టీలో మెరిసిన ఎంఎస్ ధోని

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలు  పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఘనంగా జరిగాయి. ఈ పార్టీలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే ధోని తన భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి ఈ పార్టీకి హాజరయ్యారు. కారులో వెళ్తున్న ధోనిని చూసేందుకు ఫ్యాన్స్  ఎగబడ్డారు. 

 ఈ బర్త్ డే పార్టీ పెద్ద హంగామా లేకుండా కేవలం కుటుంబికులు, సన్నిహితుల మధ్య చాలా ప్రైవేట్‌గా నిర్వహించారు. పార్టీలో సల్మాన్ ఖాన్ తన ఫేవరెట్ బ్లాక్ టీ-షర్ట్, జీన్స్‌లో కనిపించగా.. ధోని మాత్రం స్టైలిష్‌గా టాన్ కలర్ జాకెట్ ధరించారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందే సల్మాన్ బావమరిది అతుల్ అగ్నిహోత్రి ఒక ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశారు. అందులో సల్మాన్, ధోని ఇంకా సింగర్ ఏపీ ధిల్లాన్ ముగ్గురూ బురదలో ఏటీవీ (ATV) బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. ఈ పాత ఫోటో కూడా నెట్టింట సందడి చేస్తోంది.