గాలిలో 10 మీటర్ల దాకా వైరస్

గాలిలో 10 మీటర్ల దాకా వైరస్

సైంటిఫిక్​ అడ్వైజరీ కొత్త గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌
వెంటిలేషన్​తో వ్యాప్తిని ఆపొచ్చు
రెండు మాస్కులు పెట్టుకుంటే బెటర్​
ఆశాలకు ‘యాంటిజెన్’ ట్రైనింగ్​ ఇవ్వండి
కరోనా వ్యాప్తికి తుంపర్లే ముఖ్య కారణం
   ప్రిన్సిపల్ ​సైంటిఫిక్​ అడ్వైజరీ కొత్త గైడ్ లైన్స్​
    వెంటిలేషన్​తో వ్యాప్తిని ఆపొచ్చు
   గైడ్​లైన్స్​లో ప్రధానాంశాలు
    కరోనా వైరస్​ వ్యాప్తికి కారణమయ్యే తుంపర్లు (ఏయిరోసోల్స్) గాలిలో10 మీటర్ల వరకు వెళ్లే చాన్స్ ఉంది.
    లక్షణాలు లేని వారి నుంచి కూడా వైరస్‌ వ్యాపిస్తుంది.
    కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌, 
ఫిజికల్ డిస్టెన్స్ తో పాటు ఇండ్లు, ఆఫీసుల్లో గాలి, వెలుతురు బాగా ఉండేట్టు చూసుకోవాలి.
  షాపింగ్ మాల్స్, ఆడిటోరియాలు, ఆఫీసుల్లో గాబెల్ ఫ్యాన్ 
సిస్టమ్​తోపాటు రూఫ్​ వెంటిలేటర్లు వాడితే మంచిది.

న్యూఢిల్లీ:కరోనా వైరస్​ వ్యాప్తికి కారణమయ్యే గాలి తుంపర్లు (ఎయిరోసోల్స్)  10 మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌‌‌‌ సైంటిఫిక్‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌  చెప్పింది. లక్షణాలు లేని వాళ్ల నుంచి కూడా వైరస్‌‌‌‌ వ్యాపిస్తుందని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. వైరస్‌‌‌‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి సోషల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. కరోనా కట్టడికి సైంటిఫిక్​ అడ్వైజర్​ ఆఫీస్​ గురువారం కొత్త  గైడ్​లైన్స్ ​విడుదల చేసింది.  
వెంటిలేషన్ ​బాగుండాలి
ఏసీలు వాడుతూ డోర్లన్నీ మూసేస్తే వైరస్‌‌‌‌ గదిలోనే ఉంటుందని, ఆ సమయంలో వైరస్‌‌‌‌ సోకిన వ్యక్తి నుంచి వేరే వాళ్లకు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సైంటిఫిక్​ అడ్వైజర్​ ఆఫీస్​ చెప్పింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్క్‌‌‌‌లు, సోషల్​ డిస్టెన్సింగ్, శానిటైజేషన్​తో పాటు ఇంటి లోపల, ఆఫీసుల్లో గాలి, వెలుతురు బాగా ఉండేట్టు చూసుకోవాలని సూచించింది. షాపింగ్​ మాల్స్​, ఆడిటోరియాలు, ఆఫీసుల్లో గాబెల్​ ఫ్యాన్ ​​సిస్టమ్​తోపాటు రూఫ్​ వెంటిలేటర్లు వాడాలంది. వైరస్​ సోకిన వ్యక్తి నుంచి డ్రాప్​లెట్లు వెలువడి నేలపై పడ్డాక ఆ ప్రదేశాలను ఇతరులు ముట్టుకుని అదే చేతులతో ముఖం, నోటిని తాకితే వైరస్‌‌‌‌ సోకే ప్రమాదం ఉందని వివరించింది. కాబట్టి నేలను కూడా ఎప్పటికప్పుడు బ్లీచ్​, ఫినాయిల్​తో కడగాలని చెప్పింది. 
ఊర్లల్లో టెస్టింగ్​ పెంచాలె
ప్రజలు తప్పకుండా డబుల్ లేయర్ మాస్కు ధరించాలని సైంటిఫిక్​ అడ్వైజర్​ ఆఫీస్​ సూచించింది. మొదట సర్జికల్ మాస్కు పెట్టుకుని, దానిపై నుంచి క్లాత్ మాస్కు పెట్టుకోవాలని చెప్పింది.  సర్జికల్ మాస్కు అందుబాటులో లేకుంటే రెండు కాటన్ మాస్కులు పెట్టుకోవాలంది. సాధారణంగా సర్జికల్ మాస్కులు ఒకసారే వాడతారని, కానీ డబుల్ మాస్కు విధానంలో 5 సార్లు వాడొచ్చని స్పష్టం చేసింది. పెట్టుకున్న ప్రతిసారీ ఆ మాస్కును ఎండలో ఆరబెట్టుకోవాలని చెప్పింది. గ్రామాలు, సెమీ అర్బన్‌‌‌‌ ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని.. ఆశా, అంగన్‌‌‌‌వాడీ కార్యకర్తలకు రాపిడ్‌‌‌‌ యాంటీజెన్‌‌‌‌ పరీక్షలు చేయడంలో శిక్షణ ఇవ్వాలని సూచించింది.