పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం మీడియాయతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఓటమి బాధను పక్కనపెట్టి, దేశ అభివృద్ధికి బాధ్యతగా సహకరించాలని కోరారు. 18వ లోక్‌సభ ఆరో సమావేశం & రాజ్యసభ 269వ సమావేశం మొదలుకావడానికి ముందు పార్లమెంటు వద్ద విలేకరులతో మాట్లాడిన ప్రధాని, ఈ సమావేశాలు రాజకీయ పరిణామాలకు వేదిక కాకుండా, ఉపయోగకరమైన, మంచి చర్చలకు వేదిక కావాలని అన్నారు.
ఈ శీతాకాల సమావేశాలు ఏదో ఆచారం ప్రకారం చేసేవి కావు. దేశాన్ని త్వరగా ముందుకు తీసుకెళ్లడానికి మనం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సమావేశాలు బలం ఇస్తాయి అని చెప్పారు. దేశం కోసం మనం ఏమి చేయాలనుకుంటున్నామో, పార్లమెంటు తీరు దాన్ని చూపించాలని కూడా చెప్పారు. ప్రపంచం మన ప్రజాస్వామ్యం, మన ఆర్థిక వ్యవస్థ బలపడటాన్ని చాలా దగ్గరగా గమనిస్తోందిని అన్నారు.
బీహార్‌లో జరిగిన ఎన్నికల గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి బీహార్ ఎన్నికలు, అక్కడ జరిగిన ఓటింగ్, మన ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో చూపిస్తున్నాయి. తల్లులు, సోదరీమణులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం కొత్త ఆశను ఇస్తోందిని అన్నారు. పార్లమెంటులో బాధ్యతగా వ్యవహరించడం ద్వారా ఈ పెరిగిన నమ్మకం నిలబడాలని అన్నారు మోదీ.
ప్రతిపక్షాలను నేరుగా ఉద్దేశించి మాట్లాడుతూ వారు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి అనేది అడ్డుకోవడానికి కారణం కాకూడదు. అలాగే విజయం కూడా అహంకారంగా మారకూడదు అని అన్నారు. ఇంకా, అన్ని పార్టీలు పార్లమెంటు ఉద్దేశాన్ని గుర్తించి ఓటమి నిరాశ నుండి బయటపడాలని ప్రధానమంత్రి కోరారు.
ఎన్నికల ఫలితాలను కొన్ని ప్రతిపక్ష పార్టీలు అంగీకరించలేకపోతున్నాయని చెప్పే ప్రకటనలు తాను విన్నానని కూడా అన్నారు ప్రధాని. ఓటమిని అంగీకరించలేని పార్టీలు ఒకటి లేదా రెండు ఉన్నాయి. నిన్న నేను విన్న మాటలను బట్టి, ఈ నష్టం వారిని బాగా బాధించినట్లు కనిపిస్తోందని అన్నారు.
ఈ సమావేశాలు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జాతీయ ఆలోచనను చూపించాలని ప్రధాని మోదీ అన్నారు, ఈ పార్లమెంటు సమావేశాలు పార్లమెంట్ దేశం కోసం ఎం ఆలోచిస్తుందో, ఎం చేయాలనుకుంటుందో, ఎం చేయబోతోందో తెలియజేస్తాయి అని అన్నారు. ప్రతిపక్షాలు అడ్డుపడకుండా సరైన చర్చల ద్వారా సమస్యలను చెప్పాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
ఉదయం 11 గంటలకు మొదలయ్యే శీతాకాల సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025, ఆరోగ్య భద్రత అలాగే జాతీయ భద్రతా సెస్సు బిల్లు 2025, మణిపూర్ జీఎస్‌టీ (రెండవ సవరణ) బిల్లు 2025 వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
