ఇది స్ట్రెస్​ తగ్గించే విటమిన్.. ఏం తినాలంటే?

ఇది స్ట్రెస్​ తగ్గించే విటమిన్.. ఏం తినాలంటే?

మూడ్స్​ని కంట్రోల్​ చేయడంలో, మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా చూడడంలో విటమిన్​ బి6 (పైరిడాక్సిన్​) బాగా పనిచేస్తుంది. అంతేకాదు శరీరం ప్రోటీన్లని  గ్రహించడంలో కూడా సాయపడుతుంది.

విటమిన్​ బి6 లోపం ఏర్పడకుండా ఏమేం తినాలంటే..  

  • విటమిన్​ బి6 క్యారెట్లలో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఫైబర్​తోపాటు కళ్లని ఆరోగ్యంగా ఉంచే విటమిన్​– ఎ కూడా క్యారెట్లలో దొరుకుతుంది. 
  •   విటమిన్​ బి6 కోసమే కాకుండా బరువు తగ్గాలి అనుకునేవాళ్లు రోజుకొక అరటిపండు తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్​ హెల్త్​కు మంచివి.
  •   పాలకూరలో విటమిన్​ బి6తో పాటు ఐరన్, ఫోలేట్​, పొటాషియం వంటి న్యూట్రియెంట్స్ ఉంటాయి. చలికాలంలో పాలకూర రెగ్యులర్​గా తింటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
  •   చలికాలంలో గుడ్లు తింటే ఒళ్లంతా  వెచ్చగా ఉంటుంది. బ్రేక్​ఫాస్ట్​లో ఆమ్లెట్​ లేదా ఉడకబెట్టిన గుడ్లు తింటే విటమిన్​ బి6 లోపం ఏర్పడదు. 
  •   పచ్చి బఠాణీల్లో విటమిన్​ బి6 ఎక్కువ. వీటిని సలాడ్స్​ లేదా సైడ్ డిష్​గా క్యారెట్లు, ఆలుగడ్డలతో కలిపి తినొచ్చు కూడా. 
  •   క్యాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్స్​, అవకాడోలో విటమిన్​బి6 పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో హార్మోన్లు కూడా బ్యాలెన్స్​ అవుతాయి. 
  •   టొమాటోలో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా. అలాగే టొమాటోలో ఉండే లైకోపిన్​ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. 
  •   అతి తక్కువ కేలరీలుండే కీరదోసలో విటమిన్​బి6 పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల డీ హైడ్రేషన్ దరిచేరదు. మెటబాలిజంకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు.  ఒబెసిటీ నుంచి బయటపడొచ్చు. 
  •   బీన్స్​ని రెగ్యులర్​గా తింటే బి6 లోపం దరిచేరదు. అలాగే వీటిల్లోని జింక్​, కాపర్, మాంగనీస్​, సెలీనియం, విటమిన్​–ఇ, కె లు షుగర్​ లెవల్స్​ని కంట్రోల్​ చేసి మూడ్ స్వింగ్స్​కి బ్రేక్​ వేస్తాయి. 
  •   శెనగలు,  చేపల్ని డైట్​లో చేర్చినా బి6 లోపం నుంచి తప్పించుకోవచ్చు.
  •   పుదీనాని జ్యూస్​లా లేదా ఏదైనా కూరల్లో వేసుకుని తింటే బి6 లోపం రాదు. అలాగే పుదీనా తినడం వల్ల విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం కూడా శరీరానికి అందుతాయి. 
  •   స్వీట్​ పొటాటో, కార్న్​లోనూ విటమిన్​ బి6  ఎక్కువగా ఉంటుంది.
  •   రోజూ పాలు తాగితే కూడా విటమిన్​ బి6 తగ్గకుండా చూసుకోవచ్చు. 
  •   అలాగే చికెన్​ లివర్​ తిన్నా విటమిన్​ బి6 తో పాటు ఫోలేట్​, ఐరన్​ వంటివి దొరుకుతాయి.